హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సీనియర్ సంపాదకులు కే శ్రీనివాస్‌రెడ్డి పదవీకాలాన్ని ప్రభుత్వం మరో రెండేండ్లపాటు పొడిగించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. 2024 ఫిబ్రవరి 26న రెండేండ్ల కాలానికి మీడియా అకాడమీ చైర్మన్‌గా శ్రీనివాస్‌రెడ్డిని ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. మంగళవారంతో ఆయన పదవీకాలం ముగిసిన నేపథ్యంలో మరో రెండేండ్లపాటు పొడగించింది.