Congress Leaders | కాంగ్రెస్ నాయకులు నమస్తే నర్సాపూర్ అంటూ తిరగడమేనా..? ప్రజలను ఏమైనా పట్టించుకునేది ఉందా..? అని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నయీముద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు బిక్షపతి ఎద్దేవా చేశారు.. ఆదివారం నర్సాపూర్ మున్సిపాలిటీలోని 6, 7, 8,9 వార్డులలో వరద బాధితులను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నమస్తే నర్సాపూర్ అంటూ మున్సిపాలిటీలో చక్కర్లు కొట్టిన కాంగ్రెస్ నాయకులు వరద బాధితులను మర్చిపోయారని ఎద్దేవా చేశారు. అకాల వర్షంతో ఇంట్లోకి నీరు చేరి నిత్యవసర సరుకులు తడిసిపోయి ప్రజలు రోడ్డున పడ్డారని గుర్తు చేశారు. ఇందుకుగాను బాధితుల వద్దకు వెళ్లి వారికి ఆర్థిక సహాయం అందజేసి పరామర్శించడం జరిగిందన్నారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం మూలంగానే వరద నీరు ఇండ్లలోకి చేరాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని… కొన్ని అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు నిలిపివేసిందని మండిపడ్డారు.
ఇప్పటికైనా నర్సాపూర్ మున్సిపాలిటీకి రావాల్సిన 40 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే మున్సిపాలిటీకి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 21 నెలలు పూర్తయిన నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా నిధులు తేలేకపోయారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సత్యం గౌడ్, బాల్ రెడ్డి, షేక్ హుస్సేన్, మహమ్మద్ షరీఫ్, ఆనంద్ కుమార్, లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Srinuvaitla | బాలకృష్ణతో సినిమాపై స్పందించిన శ్రీనువైట్ల.!
Film Federation | ఫిల్మ్ ఫెడరేషన్ కార్యాలయం వద్ద సినీ కార్మికుల నిరసన