High Cholesterol Symptoms | కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే కనిపించే లక్షణాలు ఇవే.. ఏ పరీక్షలు చేయించుకోవాలంటే..?
మన శరీరానికి అవసరమైన వాటిల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో, హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో, ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇది మనకు ఎంతో సహాయపడుతుంది. కానీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండడం కూడా చాలా అవసరం.
High Cholesterol Symptoms | మన శరీరానికి అవసరమైన వాటిల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. కణాలను ఆరోగ్యంగా ఉంచడంలో, హార్మోన్లను ఉత్పత్తి చేయడంలో, ఆహారాన్ని జీర్ణం చేయడంలో ఇది మనకు ఎంతో సహాయపడుతుంది. కానీ శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండడం కూడా చాలా అవసరం. మంచి కొలెస్ట్రాల్ అదనంగా ఉండే కొవ్వును కాలేయానికి తీసుకెళ్లి దానిని తొలగిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ శరీరంలో పేరుకుపోతుంది. ముఖ్యంగా ధమనుల్లో ఎక్కువగా పేరుకుపోతుంది. మనం తీసుకునే ఆహారం ద్వారా మాత్రమే కాకుండా జన్యుపరంగా కూడా కొందరిలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, తగినంత శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం వంటి వాటితో పాటు కొన్ని రకాల మందులు కూడా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి. దీంతో ధమనుల అంచుల వెంబడి ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోయి వాటిని ఇరుకుగా చేస్తుంది. తద్వారా గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
లక్షణాలు..
అయితే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎటువంటి లక్షణాలను చూపించదు. రక్తపరీక్షలు చేయడం ద్వారా మాత్రమే మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని తెలుసుకోవచ్చు. ఇక ఈ కొలెస్ట్రాల్ స్థాయిలు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మోచేతులు, మోకాళ్లు, చీలమండలం వంటి భాగాల్లో కొవ్వు గడ్డల రూపంలో కనిపిస్తాయి. అలాగే కొందరిలో కార్నియల్ ఆర్కస్, ఐరిస్ చుట్టూ లేత బూడిద తెలుపు వలయాలు ఏర్పడతాయి. ఈ సంకేతాలు ఎటువంటి హానిని కలిగించనప్పటికీ శరీరంలో సంవత్సరాల తరబడి కొలెస్ట్రాల్ ఉండడాన్ని తెలియజేస్తాయి.
నిర్దారణ పరీక్షలు..
లిపిడ్ ప్రొఫైల్ అపి పిలవబడే రక్తపరీక్ష ద్వారా మనం మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తెలుసుకోవచ్చు. ఇది కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయిలను తెలియజేస్తుంది. 8 నుండి 12 గంటల పాటు ఉపవాసం ఉన్న తరువాత ఈ పరీక్షలు చేస్తారు. చెడు కొలెస్ట్రాల్ మన శరీరంలో 130 mg/dl కంటే తక్కువగా ఉండాలి. ఇక మంచి కొలెస్ట్రాల్ పురుషుల్లో 40 mg/dl కంటే ఎక్కువగా, స్త్రీలల్లో 50 mg/dl కంటే ఎక్కువగా ఉండాలి.
ఈ మధ్య కాలంలో కొలెస్ట్రాల్ సమస్యతో మనలో చాలా మంది బాధపడుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ కారణంగా గుండె ఆరోగ్యంతో పాటు శరీర మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండేలా చూసుకోవాలి. రోజూ వ్యాయామం చేయడం, ధూమపానం మానేయడం, శరీర బరువును అదుపులో ఉంచుకోవడం, జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వంటివి చేయడం వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్య తలెత్తకుండా ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

