SL vs IRE | మెరిసిన పెరీరా, మెండిస్.. ఐర్లాండ్ ముందు భారీ లక్ష్యం..!
SL vs IRE : సొంతగడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఆరంభ పోరులో టాపార్డర్ విఫలమైనా శ్రీలంకను మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు. కుశాల్ పెరీరా(56 నాటౌట్), కమిందు మెండిస్(44) రాణించారు.
SL vs IRE : సొంతగడ్డపై జరుగుతున్న టీ20 ప్రపంచకప్ ఆరంభ పోరులో టాపార్డర్ విఫలమైనా శ్రీలంకను మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు. కుశాల్ పెరీరా(56 నాటౌట్), కమిందు మెండిస్(44) రాణించారు. ఐర్లాండ్ ఫీల్డర్లు క్యాచ్‌లు నేలపాలు చేయడం కూడా లంక ద్వయానికి కలిసొచ్చింది. డెత్ ఓవర్లలో మరింత చెలరేగాలనుకున్న మెండిస్, దసున్ శనక(0) గోల్డెన్ డక్‌గా వెంట వెంటనే ఔటయ్యారు. ఆఖరి ఓవర్లో బౌండరీతో పెరీరా హాఫ్ సెంచరీ సాధించగా ప్రత్యర్ధికి 164 పరగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఆతిథ్య జట్టు.
స్వదేశంలో తొలి మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక ఆరంభంలో తడబడినా అద్భుతంగా పుంజుకుంది. ఐర్లాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో నాలుగో ఓవర్లోనే ఓపెనర్ కమిల్ మిశారా(14) వెనుదిరిగాడు. పథుమ్ నిశాంక(24) జతగా కుశాల్ మెండిస్(56 నాటౌట్) దూకుడుగా ఆడాడు.. మేక్ కార్టీ(2-40) వేసిన పవర్ ప్లే చివరి ఓవర్లో మెండిస్ మూడు ఫోర్లు బాదగా లంక 50 రన్స్ చేసింది. డేంజరస్ నిశాంకను డాక్రెల్ ఔట్ చేయగా.. పవన్ రత్ననాయకే(5)ను డాక్వెల్, దునిత్ వెల్లలాగే (10)ను డెలానీ పెవిలియన్ పంపారు.
163/6 on the board! 🇱🇰 Target set. Time for our bowlers to do the rest. Let’s go, Lions! 🦁💪 #SriLankaCricket #SLvIRE pic.twitter.com/L2VOzasfY8
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) February 8, 2026
ఆ తర్వాత కుశాల్ మెండిస్ జతగా కమిందు మెండిస్(44) ఇన్నింగ్స్ నిర్మించారు. వీరిద్దరూ ప్రత్యర్థి బౌలర్లను సమర్ధంగా ఆడుతూ స్కోర్ వంద దాటించారు. దసున్ శనక వస్తూ వస్తూనే బిగ్ షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. హ్యాట్రిక్ బంతి వైడ్ వేయగా.. ఆ ఓవర్లో రన్స్ వచ్చాయి. మార్క్ అడైర్ వేసిన చివరి ఓవర్లో తొలి బంతికి బౌండరీతో కుశాల్ అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆఖరి బంతికి రెండు రన్స్ రాగా.. లంక 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేయగలిగింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

