PRC | పాపన్నపేట, జులై 3 : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు పీఆర్సీని వెంటనే ప్రకటించాలని తపస్ మండల శాఖ అధ్యక్షుడు మంగ నరసింహులు, ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పాపన్నపేట మండల పరిధిలోని వివిధ పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం వెంటనే 53 శాతం పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ డీఏలు చెల్లించాలని, సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ ప్రవేశపెట్టాలని, ఉద్యోగులకు రావాలసిన బకాయిలు వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. సీఆర్పీల సమ్మె కాలపు జీతాలను ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రసాద్ రెడ్డి, తులసిరాం, రాజశేఖర్, ప్రవీణ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
DEO Radha Kishan | కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో రాధా కిషన్