Insurance | నర్సాపూర్, జూలై 19 : కేంద్ర ప్రభుత్వం అమలుపరిచిన భీమా సౌకర్యాలను సద్వినియోగపరుచుకోవాలని నర్సాపూర్ ఎస్బీఐ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సంతోష్ సూచించారు. శనివారం మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌజన్యంతో విడ్స్ స్వచ్చంద సంస్థ నిర్వహణలో ఎస్బీఐ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సంతోష్ ఆర్థిక అక్షరాస్యతపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాన మంత్రి సురక్ష భీమా యోజన, ప్రధాన మంత్రి జీవన జ్యోతి భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన అనే భీమా పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు. గ్రామంలోని రైతులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్ షేక్ శెహబాజ్ పాల్గొన్నారు.
Yadagirigutta : యాదగిరిగుట్టలో రూ.5 వేలతో గరుఢ టికెట్ !
అప్రెంటీస్ విధానంలో టీజీఎస్ఆర్టీసీలో దరఖాస్తుల ఆహ్వానం
Online scams | ఆన్ లైన్ మోసాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి.. షీ టీం సీనియర్ సభ్యురాలు స్నేహలత