Collector Rahul raj | పాపన్నపేట, ఆగస్టు 9 : విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆయన శనివారం సాయంత్రం పాపన్నపేట మండల పరిధిలోని మిన్పూర్ సబ్ స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నిరంతర విద్యుత్ సరఫరా అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా విద్యుత్ సరఫరా, నిర్వహణ ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.
విద్యుత్ సరఫరాకు సంబంధించిన పరికరాలు, నిర్వహణ ఏర్పాట్లు, భద్రతా చర్యలు మొదలైన వాటిని పరిశీలించారు. అంతేకాకుండా సబ్ స్టేషన్ లోని సాంకేతిక పరికరాల పనితీరును పరిశీలించి, అవసరమైన సూచనలు చేశారు. సబ్ స్టేషన్ లోని సాంకేతిక సిబ్బందికి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంబంధిత విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Shivraj Singh Chouhan: చెట్టుకు రాఖీ కట్టిన కేంద్ర మంత్రి శివరాజ్.. వీడియో