Gram Panchayat Workers | చిలిపిచెడ్, ఆగస్టు 13 : గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు రోగాలు రాకుండా చూడాలన్నా గ్రామ పంచాయతీ కార్మికుడి రెక్కల కష్టం లేనిది సాధ్యం కాదని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు అన్నారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ ప్రశాంత్కు ఈ మేరకు ఓ వినతి పత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతున్నా గ్రామాల్లో పని చేస్తున్న కార్మికుల సమస్యలు మాత్రం పట్టించుకోకుండా వ్యవహరించడం సిగ్గు చేటని మండిపడ్డారు.
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు ఇవ్వకపోను ఇచ్చే అరకొర వేతనాలు సమయానికి రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు అనేక ఇబ్బందులతో బాధపడుతున్న కొత్తగా మల్టీ పర్పస్ విధానం తీసుకొచ్చి కార్మికుల నడ్డివిరుస్తున్నారని ఆరోపించారు. వర్షాకాలం మొదలైనప్పటికి కార్మికులకు కనీస సౌకర్యాలైన గ్లౌజులు, గాం షూస్, మాస్కులు, బెల్లం, సబ్బులు ఇవ్వడం లేదన్నారు.
స్పెషల్ ఆఫీసర్ వచ్చినప్పటినుండి నేటివరకు ఒక జత యూనిఫామ్ బట్టలు ఇవ్వలేదని మండిపడ్డారు. తక్షణమే కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలనీ.. లేనిపక్షంలో సీఐటీయూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున్న ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బందెల్లీ, ప్రభాకర్, వెంకయ్య, సంజీవులు, గోపాల్, మణయ్య తదితరులు పాల్గొన్నారు.
Heavy Rains | అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు.. భారీ వర్షాల నేపథ్యంలో ఎస్సై కీలక ఆదేశాలు
Road Repair | ఆదమరిస్తే అంతే.. సారూ ఈ రోడ్లకు జర మరమ్మతులు చేయించండి
గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం.. ప్రత్యేక అధికారుల పాలనలో ప్రజలకు అవస్థలు