labourers | రామాయంపేట, జూలై 13 : బీడీలు చేసే కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్‌ను నెలకు రూ.5 వేలకు తగ్గకుండా ఇవ్వాలని నూతన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివంది సత్యం పేర్కొన్నారు. ఆదివారం రామాయంపేట పట్టణంలోని బీడీ కార్ఖానలోకి వెళ్లి కార్మికులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం బీడీ కార్మికుల పట్ల పూర్తి వివక్షను చూపిస్తుందని అన్నారు.
పొద్దంతా కష్టపడితే వెయ్యి బీడీలకు కనీస వేతనం కూడా రావడం లేదని అలాంటి కార్మికులపై పక్షపాత ధోరణిగా వ్యవహరించడం కేంద్రంకు తగదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బీడీ పరిశ్రమల యాజమాన్యాలతో మాట్లాడి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బీడీలు చుట్టేవారితో పాటు గంపచాట్, ప్యాకర్స్ వారికి కూడా ఈపీఎస్ ఐదువేలు వర్తించే విదంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవలాన్నారు.బీడీలు చుట్టే కార్మికులకు నెలలో 25 రోజులపాటు పనులను కల్పించాలన్నారు.సమాన పనికి సమాన వేతనాన్ని కార్మికులకు ప్రభుత్వం పరిశ్రమల యాజమాన్యాలతో ఇప్పించాలన్నారు.
Protest | కస్టోడియల్ డెత్‌పై నటుడు విజయ్ నేతృత్వంలో టీవీకే భారీ నిరసన.. Video
Sircilla | సిరిసిల్లలో ఇసుక ట్రాక్టర్ ట్రిప్పుకు 6 వేలు.. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఆందోళన
Nagarkurnool | తిమ్మినోనిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం