Potholes | టేక్మాల్, జూన్ 11 : గుంతలమయంగా ఉన్న రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులు అసౌకర్యానికి గురవుతున్నారు. దీనికితోడు గత రెండు రోజులుగా కురిసిన వర్షానికి రోడ్డంతా బురదమయంగా మారింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టేక్మాల్ నుంచి జోగిపేటకు వెళ్లేందుకు రోడ్డును విస్తరించి తారు రోడ్డు వేశారు. అయితే ధనూర గ్రామం దాటిన తర్వాత బ్రిడ్జి నిర్మించినప్పటికిని తారు రోడ్డు వేయలేదు. మట్టిరోడ్డు కావడంతో గుంతలు ఏర్పడ్డాయి. ఇటీవల కురిసిన వర్షానికి వరదనీరు గుంతల్లో చేరింది.
వాహనాల రాకపోకలతో బురదమయంగా మారింది. ఈ దారిన ప్రయాణించే వాహనదారులు బురదమయంగా ఉన్న రోడ్డుతో పడరాని పాట్లు పడుతున్నారు. ద్విచక్ర వాహనదారులైతే సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ రోడ్డులో బైక్ పై వెళ్లేవారు అదుపు తప్పి కింద పడిపోయి గాయాల పాలవుతున్నారు. నిత్యం వ్యాపారులు, ఉద్యోగులు, ఇతరత్రా అవసరాల నిమిత్తం జోగిపేటకు ఈ దారిన వెళ్తుంటారు.
కారులో వెళ్లేవారు బొడ్మట్‌పల్లి నుంచి తిరిగి వెళ్తుండగా, ఆటోలు, బైక్‌లపై వెళ్లేవారు మాత్రం ఈ దారి మీదుగానే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. అలాంటిది రోడ్డు గుంతలుగా, బురదతో నిండిపోవడంతో ఇటు నుంచి వెళ్లాలంటేనే జంకుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను పూర్తి చేయాలని వాహనదారులు, ప్రయాణికులు కోరుతున్నారు.
‘అశుద్ధ’ జలం..! గాగిళ్లాపూర్‌లో కలుషితమవుతున్న తాగునీరు
UPI Payments | రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
BRK Bhavan | తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై ఫొటో జర్నలిస్టులను అడ్డుకున్న పోలీసులు