Crop Change | కొల్చారం, జూన్ 12 : పంట మార్పిడితో అధిక లాభాలు చేకూరుతాయని కేంధ్ర ప్రభుత్వ వ్యవసాయ పరిశోధనా సంస్థ ICAR శాస్త్రవేత్తలు తెలిపారు. కొల్చారం మండల పరిధిలోని సంగాయిపేట గ్రామంలో ఏఓ స్వేతాకుమారి ఆధ్వర్యంలో గురువారం వికసిత్ సంకల్ప అభియాన్ కృషి ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. రైతులు ఆధునిక వ్యవసాయ పద్దతులను పాటించాలన్నారు.
పంట మార్పిడి ద్వారా నేలలో సేంద్రీయ కర్భనాన్ని పెంపొందిస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలన్నారు. వ్యవసాయంలో డ్రోన్ వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలను వివరించారు. వరిలో కలుపు నివారణ, పోషక యాజమాన్య పద్ధతులను వివరించారు.
ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ షేక్ ఎన్ మీరా, డైరెక్టర్ అటారి జోన్-x, డాక్టర్ వికే సింగ్, డాక్టర్ మహేందర్ కుమార్, టి సురేష్ కుమార్, కిషన్ కుమార్, యస్డి నల్కర్, ప్రతాప్ రెడ్డి, రవికుమార్, వినయ్ విన్సెంట్, ఏవో స్వేతా కుమారి, ఏఈఓ రాజశేఖర్, కోరమాండల్ ప్రతినిధి శ్యామ్ సుందర్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
Ahmedabad plane crash | అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై ఏపీ ప్రముఖుల దిగ్భ్రాంతి
Nidamanoor : భూ భారతితో భూములకు భద్రత : వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అంకతి సత్యం
Surekha Vani | సురేఖా వాణి చేసిన పనికి తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్