Sunitha Lakshma Reddy | శివ్వంపేట, సెప్టెంబర్ 6 : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని మాజీ మంత్రి, నర్సాపూర్ సునీతాలక్ష్మారెడ్డి విమర్శించారు. శివ్వంపేట మండలం చిన్నగొట్టిముక్ల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజలకు బాకీ కార్డులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారెంటీలను గుర్తు చేస్తూ బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మహిళలకు నెలకు రూ.2,500 నగదు సాయం, పింఛన్లు, రైతులకు సంబంధించిన హామీలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద తులం బంగారం, నిరుద్యోగులకు ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, విద్యార్థులకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేయడానికే బాకీ కార్డులు అని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెల్లించాల్సిన బాకీలను ప్రజల దృష్టికి తీసుకెళ్లడమే కార్యక్రమం ఉద్దేశమని ఆమె తెలిపారు. ఇంటింటికీ వెళ్లి కార్డులను పంపిణీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణ గౌడ్, జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, జడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యులు మన్సూర్, సర్పంచ్ నారాయణరావు, ఉప సర్పంచ్ పాపయ్య చారి, వివిధ గ్రామాల సర్పంచులు కొమురయ్య, తేజస్విని రాజేందర్ నాయక్, బేగరి నర్సయ్య, బీఆర్ఎస్ నాయకులు కాంతారావు, నరసింహారెడ్డి, బిక్షపతి రెడ్డి, కుంట లక్ష్మణ్, రేణు కుమార్, లక్ష్మీనర్సయ్య, బోళ్ల ఆంజనేయులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Bittu Tabahi | నదిని శుభ్రం చేసిన యువకుడు.. బిట్టు తబాహికి పద్మ ఇవ్వాలన్న సింగర్ చిన్మయి!
న్యూడ్ ఫొటోలతో కాంగ్రెస్ నాయకుడి బెదిరింపులు.. సూర్యాపేటలో మహిళ ఆత్మహత్యాయత్నం
Bigg Boss | బిగ్ బాస్ హౌజ్లోకి వెళ్లకుండానే ఎలిమినేషన్.. క్రిటిక్కి షాకిచ్చిన ఆడియన్స్!