Bigg Boss | తెలుగు, తమిళ భాషల్లో బిగ్ బాస్ సీజన్ 10 ఒకేసారి సందడి మొదలుపెట్టింది. తెలుగులో కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా.. తమిళంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 6న గ్రాండ్‌గా ప్రారంభమైన తమిళ్ బిగ్ బాస్ 10లో తొలిరోజే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సాధారణంగా బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన తర్వాతే ఎలిమినేషన్స్ మొదలవుతాయి. కానీ ఈసారి మాత్రం హౌస్‌లో అడుగుపెట్టకముందే ఓ కంటెస్టెంట్‌కు ఎలిమినేషన్ ఎదురైంది. తమిళ్ సినీ క్రిటిక్, సోషల్ మీడియా కామెంటేటర్ ప్రశాంత్ రంగస్వామి బిగ్ బాస్ తమిళ్ సీజన్ 10లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వాలని ఆశించారు. అయితే ఆయనకు ప్రేక్షకుల నుంచి అనూహ్యమైన తీర్పు ఎదురైంది.
బిగ్ బాస్ స్టేజిపై ప్రశాంత్ రంగస్వామితో పాటు మరో ఇద్దరు కంటెస్టెంట్లు జవిత్, పృథ్వీనాథ్లను నిలబెట్టారు. వీరికి ఒక టాపిక్ ఇచ్చి.. ఒక్కొక్కరికి రెండు నిమిషాల సమయం కేటాయించారు. ఆ సమయంలో తమ అభిప్రాయాలను ప్రేక్షకులకు వివరించాల్సి ఉంటుంది. అనంతరం ఎవరి మాటలు నచ్చాయో వారికి ఓటు వేయాలని ఆడియన్స్‌ను కోరారు. ఈ టాస్క్‌లో ప్రశాంత్ రంగస్వామి వెనుకబడిపోయారు. ప్రేక్షకుల ఓట్లలో విజయం సాధించలేకపోవడంతో ఆయన బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లే అవకాశాన్ని కోల్పోయారు. దీంతో స్టేజి మీద నుంచే వెనక్కి రావాల్సి వచ్చింది. బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్‌లోనే ఇలాంటి ట్విస్ట్ రావడంతో ప్రేక్షకులు సైతం ఆశ్చర్యపోయారు. కంటెస్టెంట్‌గా ఇంట్లోకి వెళ్లి గేమ్ ఆడకముందే ప్రశాంత్ రంగస్వామి ఎలిమినేట్ కావడం ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా ప్రశాంత్ రంగస్వామి గతంలో చేసిన వ్యాఖ్యలు, సోషల్ మీడియాలో ఆయన వ్యవహరించే తీరు కారణంగా తమిళ ప్రేక్షకుల్లో కొంత క్రేజ్‌తో పాటు వ్యతిరేకత కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ టాస్క్‌లో ప్రేక్షకులు ఇచ్చిన ఓట్లే ఆయన బిగ్ బాస్ జర్నీని ప్రారంభం కాకముందే ముగించాయి. తనకు ఎదురైన ఈ పరిణామంపై ప్రశాంత్ రంగస్వామి కూడా స్పందించారు. తనపై ప్రేమ చూపించిన వారికి, ద్వేషం చూపించిన వారికి కూడా ధన్యవాదాలు తెలిపారు. తాను డిజప్పాయింట్ కాలేదని, జరిగిన విషయంపై ఎలాంటి రిగ్రెట్స్ కూడా లేవని పేర్కొన్నట్లు సమాచారం. బిగ్ బాస్‌లోకి వెళ్లే అవకాశం మిస్ అయినప్పటికీ.. తాను మళ్లీ తన పనిలో పడిపోయానని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. షో ప్రారంభమైన మొదటి రోజే ఈ పరిణామం చోటుచేసుకోవడంతో ప్రశాంత్ రంగస్వామి పేరు సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది.