Bigg Boss 10 | ఊహించని ఎలిమినేషన్‌తో షాకిచ్చిన నాగార్జున.. హౌస్‌లో రొమాన్స్ తో అదరగొట్టిన కంటెస్టెంట్లు
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 14వ రోజు ఆదివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఆదివారం కావడంతో హౌస్‌లో సందడి, సరదా కార్యక్రమాలతో పాటు ఈ వారం ఎలిమినేషన్ కూడా జరిగింది. దీంతో కంటెస్టెంట్లలో ఒకవైపు ఉత్కంఠ, మరోవైపు భావోద్వేగాలు కనిపించాయి. శనివారం నుంచి కొనసాగుతున్న ‘మాన్యుప్యులేటర్’, ‘పప్పెట్’ అంశంపై చర్చ ఆదివారం కూడా కొనసాగింది.
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో 14వ రోజు ఆదివారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఆదివారం కావడంతో హౌస్‌లో సందడి, సరదా కార్యక్రమాలతో పాటు ఈ వారం ఎలిమినేషన్ కూడా జరిగింది. దీంతో కంటెస్టెంట్లలో ఒకవైపు ఉత్కంఠ, మరోవైపు భావోద్వేగాలు కనిపించాయి. శనివారం నుంచి కొనసాగుతున్న ‘మాన్యుప్యులేటర్’, ‘పప్పెట్’ అంశంపై చర్చ ఆదివారం కూడా కొనసాగింది. ఈ విషయంలో త్రిగున్, వర్షిణి, సుధీర్, నరేష్ తమ అభిప్రాయాలను బలంగా వ్యక్తం చేశారు.ఇక ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నాగార్జున నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లలో ఒక్కొక్కరిని సేఫ్ చేస్తూ వచ్చారు. చివరికి సుధీర్, కృష్ణుడు, సృష్టి ముగ్గురు మాత్రమే మిగిలారు. అనంతరం సుధీర్ కూడా సేఫ్ కావడంతో కృష్ణుడు, సృష్టిలలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారనే ఉత్కంఠ నెలకొంది.
అయితే ఎలిమినేషన్‌కు ముందే కృష్ణుడు తాను బయటకు వెళ్లే అవకాశం ఉందని భావించినట్లు త్రిగున్తో చెప్పాడు. తాను మానసికంగా కూడా అందుకు సిద్ధమయ్యానని పేర్కొన్నాడు. చివరకు కృష్ణుడు ఊహించినట్టుగానే నాగార్జున ఆయన ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. దీంతో సృష్టి సేఫ్ అయింది.కృష్ణుడు ఎలిమినేషన్‌తో హౌస్‌లో భావోద్వేగ వాతావరణం నెలకొంది. ఇంటి సభ్యులంతా ఆయనకు వీడ్కోలు పలికారు. కృష్ణుడు బయటకు వెళ్తుండటంతో రోహిత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. కృష్ణుడి కళ్లను తన తండ్రి కళ్లతో పోల్చుకుంటూ రోహిత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎలిమినేషన్ అనంతరం బిగ్ బాస్ వేదికపైకి వచ్చిన కృష్ణుడు.. హౌస్‌లోని కంటెస్టెంట్లపై తన అభిప్రాయాలను వెల్లడించాడు. దేబ్జానీ, అమన్, ఝాన్సీ, సృష్టి తనకు సానుకూలంగా అనిపించినవారని చెప్పాడు. మరోవైపు సుధీర్, ముఖేష్, వర్షిణి, చరణ్‌లను ప్రతికూలంగా భావిస్తున్నట్లు వెల్లడించాడు.
ఎలిమినేషన్‌కు ముందు హౌస్‌లో సరదా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఝాన్సీ తన గాత్రంతో కంటెస్టెంట్లను అలరించగా.. అమన్, త్రిగున్ కలిసి బిగ్ బాస్‌ను, హౌస్‌లోని ఆహారాన్ని ఉద్దేశిస్తూ ర్యాప్ సాంగ్ పాడి సందడి చేశారు. అదే సమయంలో దేబ్జానీ, ముఖేష్ రొమాంటిక్ పాటకు కలిసి డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నారు. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీకి మిగతా హౌస్ మేట్స్ కూడా ఫిదా అయ్యారు. మరోవైపు చరణ్, వర్షిణి కలిసి ‘పుష్ప 2’ సినిమాలోని ‘ఫీలింగ్స్’ పాటకు మాస్ స్టెప్పులతో అదరగొట్టారు. మొత్తంగా 14వ రోజు ఎపిసోడ్లో ఎలిమినేషన్‌తో పాటు భావోద్వేగాలు, వివాదాలు, సరదా క్షణాలు, డ్యాన్స్, రొమాన్స్ ఇలా అన్ని అంశాలు కలగలిసి ప్రేక్షకులకు ఆసక్తికరమైన ఎపిసోడ్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

