The Paradise | ‘ది ప్యారడైజ్’ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్.. గంటల్లోనే 50 వేలకు పైగా టికెట్లు!
Nani’s The Paradise | నేచురల్ స్టార్ నాని, పవర్ ఫుల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'ది ప్యారడైజ్' (The Paradise) చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ బాక్సాఫీస్ వద్ద అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.
Nani’s The Paradise | నేచురల్ స్టార్ నాని, పవర్ ఫుల్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అంటెసిపేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది ప్యారడైజ్’ (The Paradise) చిత్రం విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ బాక్సాఫీస్ వద్ద అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్‌లు ఇంకా ప్రారంభం కాకముందే, ఈ సినిమా ప్రీ-సేల్స్ ద్వారా రికార్డులను తిరగరాస్తూ అద్భుతమైన ఓపెనింగ్స్‌కు సిద్ధమవుతోంది.
ముఖ్యంగా హైదరాబాద్‌లో ఈ చిత్రానికి సంబంధించి ప్రీ-సేల్స్ ఊహించని రీతిలో దూసుకుపోతున్నాయి. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఒక్క హైదరాబాద్ నగరంలోనే 50,000లకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం గమనార్హం. దీని ద్వారా కేవలం ప్రీ-సేల్స్ రూపంలోనే భారీ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమామై వస్తున్న భారీ స్పందన చూస్తుంటే సినిమాపై ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ ఉందో స్పష్టంగా అర్థమవుతోంది.
సినిమా విడుదల తేదీకి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉండటం, అదీ కూడా దేశవ్యాప్తంగా ఫుల్-ఫ్లెడ్జ్డ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా జోరుగా పుంజుకోవాల్సి ఉండగానే ఈ స్థాయి రెస్పాన్స్ రావడం టాలీవుడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేస్తోంది. నాని గత చిత్రం ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగా ఉండటంతో తొలి రోజు కలెక్షన్లు ఊహించని స్థాయిలో ఉండే అవకాశం కనిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ నుంచి రావణాసురుడిగా యశ్ అదిరిపోయే గ్లింప్స్.. శివ తాండవ సోత్రంతో భీభత్సం
Energy Boosters | రోజంతా నీరసంగా ఉంటున్నారా? శక్తినిచ్చే 7 ముఖ్యమైన పోషకాలు ఇవే!
గోల్డెన్ డ్రెస్‌లో నభా నటేష్.. అందమైన నవ్వుతో కట్టిపడేస్తోందిగా!
Mahasakthi | నయనతార ‘మహశక్తి’ ట్రైలర్ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్!
RTC Conductors | డ్రైవర్లు రాలేదు.. మీరు సెలవు పెట్టి వెళ్లండి.. కండక్టర్లు విధుల్లోకి రాకుండా అడ్డుకున్న కుషాయిగూడ ఆర్టీసీ అధికారులు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

