న్యూడ్ ఫొటోలతో కాంగ్రెస్ నాయకుడి బెదిరింపులు.. సూర్యాపేటలో మహిళ ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. న్యూడ్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ ఓ మహిళపై కాంగ్రెస్ నాయకుడు వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ బెదిరింపులు ఎక్కువ కావడంతో.. మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది.
సూర్యాపేట జిల్లాలో దారుణం జరిగింది. న్యూడ్ ఫొటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ ఓ మహిళపై కాంగ్రెస్ నాయకుడు వేధింపులకు పాల్పడ్డాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ బెదిరింపులు ఎక్కువ కావడంతో.. మనస్తాపానికి గురైన ఓ మహిళ ఆత్మహత్యకు యత్నించింది.
బాధితురాలి కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంకు చెందిన మహిళను కాంగ్రెస్ నాయకుడు చింతారెడ్డి విజయభాస్కర్‌రెడ్డి వేధించాడని బాధితురాలు ఆరోపించింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఇంట్లోకి ప్రవేశించి తన నగ్న చిత్రాలను తీసినట్లు పేర్కొంది. ఆ తర్వాత వాట్సాప్ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపుతూ వేధించాడని తెలిపింది. తన నగ్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించినట్లు బాధితురాలు ఆరోపించింది.
వేధింపులతో తీవ్రంగా ఇబ్బందిపడిన మహిళ పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. అయితే నిందితుడు అధికార పార్టీకి చెందిన నాయకుడు కావడంతో పోలీసులు చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేస్తున్నారని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా నిందితుడితో రాజీ చేసుకుని ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని పోలీసులు తనపై ఒత్తిడి తెచ్చారని బాధితురాలు ఆరోపించినట్లు తెలుస్తోంది.
సూర్యాపేట జిల్లాలో దారుణం
నీ న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ కాంగ్రెస్ నాయకుడి వేధింపులు
నిందితుడి వేధింపులు, పోలీసుల బెదిరింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసిన బాధితురాలు
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంలో దారుణం
ఓ మహిళపై కాంగ్రెస్ నేత చింతారెడ్డి… pic.twitter.com/Hw5nIjjIuo
— Telugu Scribe (@TeluguScribe) September 6, 2026
నిందితుడి వేధింపులతో పాటు పోలీసుల నుంచి ఎదురైన ఒత్తిడితో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు ఆత్మహత్యకు యత్నించింది. కాగా, ఇదే తరహాలో విజయభాస్కర్‌రెడ్డి మరో ఆరుగురు మహిళలను కూడా వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయని బాధితురాలి వర్గాలు చెబుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan School: పాకిస్థాన్ స్కూల్లో కూలిన పైకప్పు.. 20 మంది విద్యార్థులు మృతి
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

