MLA Sunitha Lakshma Reddy | నర్సాపూర్, జూన్ 24 : కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ సెక్రటరీలకు మెమోలు ఇచ్చుడు బంద్ చేసి గ్రామాల పారిశుద్ద్యానికి నిధులు, గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు విడుదల చేయాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మంగళవారం ప్రెస్ నోట్ విడుదల చేస్తూ సోమవారం మండల పరిధిలోని చెప్పల్ తుర్తి గ్రామంలో చెత్త ట్రాక్టర్‌ను ఎందుకు వాడడం లేదనే విషయాన్ని అలాగే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పంచాయతీ సిబ్బంది మాజీ మంత్రి హరీష్ రావు, అలాగే నా దృష్టికి తీసుకురావడం జరిగిందని వెల్లడించారు.
ఈ కారణంతో డీపీవో పంచాయతీ సెక్రటరీకి మెమో జారీ చేయడం దారుణమని మండిపడ్డారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియపరిచారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యదర్శులందరూ ట్రాక్టర్ నడపలేమని ట్రాక్టర్ తాళాలు ఎంపీడీవోలకు అందజేసిన విషయం అందరికి తెలిసిందేనని గుర్తుచేశారు. గ్రామపంచాయతీలకు నిధులు ఇవ్వడం చేతకాక కార్యదర్శులకు మెమో జారీ చేయడం చూస్తుంటే గ్రామ ప్రజల సమస్యలపై ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ది ఉందో అర్ధమవుతుందని ఎద్దేవా చేశారు.
ఇప్పటికైనా ప్రభుత్వం మెమోలు ఇచ్చుడు బంద్ చేసి గ్రామాల పారిశుద్ద్యానికి నిధులు, గ్రామ పంచాయతీ సిబ్బందికి జీతాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చిప్పలుర్తి గ్రామపంచాయతీ సిబ్బందికి, పంచాయతీ కార్యదర్శికి సంఘీభావం తెలియజేస్తూ వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటామని తెలియజేశారు.
Garidepalli : ఎన్ఎఫ్బీఎస్ లబ్ధిదారులకు ఆర్థిక సాయం : తాసీల్దార్ కవిత
Weather Report | నాలుగు రోజులు వానలే.. హెచ్చరించిన వాతావరణశాఖ
Ram Mohan Naidu | బ్లాక్‌బాక్స్ భారత్‌లోనే ఉంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు