MLA Sunitha lakshma reddy | నర్సాపూర్, జనవరి31 : తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ను విచారణ పేరుతో అవమానిస్తున్నప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా రేపు ధర్నా, నిరసన కార్యక్రమాలను చేపట్టాలని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇచ్చి దర్యాప్తునకు పిలవడం అత్యంత హేయమైన, దారుణమైన చర్య అని మండిపడ్డారు.
65 ఏండ్లుపైబడిన వారికి స్వయంగా ఇంటికి వెళ్లి విచారించాలని చట్టం చెప్పుతున్నా కానీ, రేవంత్ రెడ్డి తొత్తులుగా పని చేసే వ్యవస్థలు ఇలా దుర్మార్గంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇలాంటి చర్యలను ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పిలుపు మేరకు నర్సాపూర్ నియోజకవర్గంలోని మండల కేంద్రాలలో, గ్రామాల్లో, మున్సిపాలిటీలో ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ధర్నా కార్యక్రమాలతోపాటు కార్యకర్తలు, నాయకులు ర్యాలీగా బయలుదేరి దిష్టిబొమ్మ దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు.
అక్రమ కేసులపై రేపు తొగుటలో నిరసన కార్యక్రమం
తొగుట జనవరి 31: ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ సాధించడంతోపాటు తెలంగాణ ను దేశంలోనే అభివృద్ధి సంక్షేమంలో ముందు వరుసలో నిలిపిన కేసీఆర్పై సిట్ పేరు మీద వేధింపులు చేయడంఫై తెలంగాణ సమాజం జీర్ణించుకోలేకపోతుందని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆదివారం (01.02.2026) ఉదయం 10 గంటలకు తొగుట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని.. కార్యక్రమం కు గౌరవ సర్పంచ్ లు, బీఆర్ఎస్ శ్రేణులు,హాజరై విజయవంతం చేయాలని కోరారు.

Sangareddy | రేపే పశువుల జాతర.. 359 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఉత్సవం గురించి తెలుసా!
Harish Rao | మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయం : మాజీ మంత్రి హరీష్ రావు