రామాయంపేట : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయమని మాజీ మంత్రి హరీష్ రావు ( Harish Rao )వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలపై ఎగిరేది గులాబీ జెండానే \నని అన్నారు. మెదక్ నియోజకవర్గంలోని రామాయంపేటలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సి. సుప్రభాత్ రావు( Suprabhat Rao) ఆ పార్టీకి గుడ్ బై చెప్పి, బీఆర్ఎస్ ( BRS ) లో చేరారు.

25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్యూఐ( NSUI )నుంచి పీసీసీ సెక్రటరీ వరకు వివిధ హోదాల్లో పనిచేసిన సుప్రభాత్రావు శుక్రవారం హైదరాబాద్లోని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు నివాసంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు కంఠరెడ్డి తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో సుప్రభాత్ రావు తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరారు. వారికి హరీష్ రావు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజల్లోనే కాదు, ఆ పార్టీ సొంత నాయకుల్లోనూ తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. రేవంత్ రెడ్డి రెండేళ్ల పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని, ఇచ్చిన హామీలు నెరవేర్చలేక చేతులెత్తేశారని విమర్శించారు. రామాయంపేటలో సుప్రభాత్ రావు చేరికతో పార్టీ మరింత బలోపేతం అయ్యిందని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రామాయంపేటలో ఎగిరేది గులాబీ జెండానే అని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.
పార్టీని నమ్ముకుని వచ్చిన వారికి సముచిత స్థానం, గౌరవం ఉంటాయని హామీ ఇచ్చారు. సుప్రభాత్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు, నాయకులకు సరైన గుర్తింపు లేదని, కేవలం గ్రూపు రాజకీయాలకే పరిమితమైందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ మాజీ చైర్మన్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.