Drinking Water | రామాయంపేట, జూన్ 10 : గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటింటికి తాగునీరందించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మిషన్ భగీరథపై అడుగడుగునా నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ రోజూ ఎక్కడో ఒక చోట మిషన్ భగీరథ నీరు వృథాగా పోతున్న ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివారులోని మిషన్ భగీరధ నీరు వృథాగా పోతున్నాయి. మంగళవారం గ్రామంలోని మెయిన్ ట్యాంకు నుండి ఇతర ట్యాంకులకు వెళ్లే ప్రధాన పైప్లైన్ వాల్వ్ ఊడిపోయింది. భగీరథ పైప్లైన్ మెదక్-రామాయంపేట రోడ్డుకు పక్కనే ఆనుకుని ఉండడంతో నీళ్లన్నివృథాగా రోడ్డుపైకి చేరాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
ఉదయం నుండి నీరు ఏకధాటిగా వెళ్తున్నా ఏ ఒక్క మిషన్ భగీరథ అధికారి అటువైపుగా రాకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అక్కడికి చేరుకుని పైప్లకు వాల్వ్ వేసి నీరు వృథా గాకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.