Midday Meal labourers | రామాయంపేట, జూన్ 21 : ప్రభుత్వం ఆరు నెలలు కావస్తున్నా మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు ఎందుకివ్వడం లేదని సీఐటీయు నాయకురాలు బాలమణి డిమాండ్ చేశారు. శనివారం మధ్యాహ్నం కార్మికులతో కలిసి సీఐటీయు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం మండల వనరుల కేంద్రం సిబ్బందికి ఈ విషయమై వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బాలమణి మాట్లాడుతూ.. ఆరు నెలల కాలంగా ఒక్కో ప్రభుత్వ పాఠశాలలో వంటలు చేసే భోజన కార్మికులకు లక్షల రూపాయల బిల్లులు కిరాణా షాపులలో పెండింగ్లో ఉంటున్నాయని అన్నారు. బిల్లులు కట్టకుంటే కిరాణా దుకాణాల వారు మళ్లీ నిత్యావసరాలు ఇవ్వడం లేదని తెలిపారు. ఇతర వ్యాపారుల వద్ద అప్పులు చేసుకుంటూ వంటలు చేస్తున్నామని తెలిపారు. తమకు వెంటనే ప్రభుత్వం బిల్లులను ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Sarangapur | కాలువల్లో పేరుకుపోయిన మురుగు.. వర్షం పడితే రోడ్డుపై నడువాలంటే చెప్పులు చేతపట్టాల్సిందే
Pension | పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయండి.. విద్యుత్ ఉద్యోగుల జేఏసీ డిమాండ్