Nidhhi agarwal | హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై సీనియర్ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ఆ వ్యాఖ్యలకు పరోక్షంగా స్పందించినట్లు కనిపించిన నిధి అగర్వాల్ తాజా పబ్లిక్ అప్పియరెన్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన ‘దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ, హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వెళ్లేటప్పుడు కాస్త ట్రెడిషనల్‌గా డ్రెస్సులు ధరించాలని సూచించారు. కొన్నిసార్లు అభ్యంతరకరమైన డ్రెస్సింగ్ కారణంగా అభిమానులు అత్యుత్సాహంగా ప్రవర్తించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మహిళల దుస్తులను కారణంగా చూపించడం సరైంది కాదని పలువురు నెటిజన్లు, సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విమర్శలు పెరగడంతో శివాజీ ఆ తర్వాత స్పందిస్తూ, తన మాటల వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని తెలిపారు. ఎవరినీ తప్పుబట్టాలన్న ఉద్దేశం తనకు లేదని, ఈవెంట్లలో ఎలాంటి అసౌకర్యకర ఘటనలు జరగకూడదనే ఉద్దేశంతోనే చెప్పానని వివరణ ఇచ్చారు. ఆ సందర్భంలో గతంలో హైదరాబాద్‌లోని లులు మాల్లో నిధి అగర్వాల్ ఎదుర్కొన్న ఘటనను కూడా ప్రస్తావించారు. అలాగే సమంతకు ఈవెంట్లలో ఎదురైన ఇబ్బందులను గుర్తు చేశారు.
శివాజీ వ్యాఖ్యల అనంతరం నిధి అగర్వాల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. బాధితురాలినే నిందించడం సానుభూతి కాదని, అలాంటి వ్యాఖ్యలు తప్పుదోవ పట్టిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఎవరినీ నేరుగా ఉద్దేశించకపోయినా, ఆ పోస్ట్ శివాజీ కామెంట్స్‌కు కౌంటర్‌గా భావిస్తూ నెటిజన్లు చర్చించుకున్నారు. ఇదిలా ఉండగా నిధి రీసెంట్గా ఫిలిం ఫేర్ అవార్డ్స్ ఈవెంట్‌కు స్టైలిష్ మోడ్రన్ డ్రెస్‌లో హాజరైన వీడియో వైరల్ అవుతోంది. దీంతో “డ్రెస్సింగ్‌తోనే సమాధానం ఇచ్చింది” అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మహిళలు ఏ దుస్తులు ధరించాలో అది వారి వ్యక్తిగత ఎంపికేనని, దానిని తప్పుబట్టడం సరికాదని పలువురు మద్దతు తెలుపుతున్నారు. శివాజీ మాత్రం తన ఉద్దేశం ఎవరినీ విమర్శించడం కాదని మరోసారి స్పష్టం చేశారు. అయినప్పటికీ, మహిళల సెక్యూరిటీ, వ్యక్తిగత స్వేచ్ఛ, డ్రెస్సింగ్‌పై సమాజంలో అవగాహన పెరగాల్సిన అవసరం ఉందన్న చర్చ మళ్లీ ప్రారంభమైంది.