Local Body Elections | మెదక్ మున్సిపాలిటీ, జూలై 12 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్దత కల్పించిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ మెదక్ పట్టణ కన్వీనర్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు శనివారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్ చట్టబద్దత కల్పిస్తామని నమ్మబలికి కాలయాపన చేస్తూ బీసీలను మోసం చేయడమేనన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి సతమతమవుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువతను మోసం చేసిందని, జాబ్ క్యాలెండర్, రాజీవ్ యువవికాసం, స్వయం ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతి అని చెప్పి ఏ ఒక్కటి అమలు చేయలేదని మండిపడ్డారు.
Siddipet | సాగు నీటి కోసం.. ఆశగా రైతుల ఎదరుచూపులు
Army Jawan Donate | ఆర్మీ జవాన్ ఆదర్శం.. మొదటి వేతనం ఆలయానికి అందజేత
BRS | బీఆర్ఎస్ హాయంలోనే గ్రామపంచాయతీల అభివృద్ధి :ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి