CITU | నర్సాపూర్, అక్టోబర్ 22 : కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏ మల్లేశం విమర్శించారు. బుధవారం నర్సాపూర్ మండల కేంద్రంలో సీఐటీయూ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏ మల్లేశం మాట్లాడుతూ.. డిసెంబర్ 7-9వ తేదిలలో మెదక్ లో జరిగే సీఐటీయూ 5వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మికులకు అన్యాయం చేసిందని, కార్మికులకు కనీస వేతనం రూ.28000 అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్, కనీస సౌకర్యాలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమయిందని తెలిపారు. ఈ మహాసభల విజయవంతానికి కార్మికులు, కర్షకులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు, జిల్లా నాయకులు ఆసిఫ్, నాయకులు చంద్రయ్య, నర్సింహులు, లక్ష్మయ్య, అనిల్, శంకరయ్య, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
Tejashwi Yadav: జీవికా దీదీలకు 30 వేల జీతం: తేజస్వి యాదవ్
Road Accident: ఢీకొన్న రెండు బస్సులు.. 63 మంది మృతి
Nidamanoor : రైతులకు మద్దతు ధరే లక్ష్యం : అంకతి సత్యం