Financial Help | మెదక్ రూరల్, అక్టోబర్ 11: మెదక్ మండలం మంబోజిపల్లి గ్రామానికి చెందిన ఇప్ప దుర్గమ్మ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మంభోజిపల్లి గ్రామ బీఆర్ఎస్ నాయకులు మెదక్ నియోజకవర్గ ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతి రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన తిరుపతి రెడ్డి దుర్గమ్మ మృతి పట్ల దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
దుర్గమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు దుర్గమ్మ అంత్యక్రియల నిమిత్తం రూ. 5 వేలు గ్రామ నాయకుల ద్వారా ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలోప్రభాకర్, అంజా గౌడ్, నవీన్, రాములు తదితరులు పాల్గొన్నారు.
Thungathurthy : ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులు : తాటికొండ సీతయ్య
Chandur : బీఆర్ఎస్ కస్తాల గ్రామ నాయకుల ఆర్థిక సాయం
Bihar Elections | ‘మేం బతికే ఉన్నాం’.. ఎన్నికల అధికారులకు బీహార్ గ్రామస్తుల మొర