చండూరు, అక్టోబర్ 11 : చండూరు మండలం కస్తాల గ్రామంలో ఇమడపాక లక్ష్మమ్మ అనారోగ్యంతో ఇటీవల మరణించింది. ఆమె కుటుంబానికి బీఆర్ఎస్ గ్రామ శాఖ నాయకులు శనివారం పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం, ఒక క్వింటా బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బొమ్మరబోయిన వెంకన్న, సింగిల్ విండో వైస్ చైర్మన్ గుండమల్ల శ్రీనివాసులు, గ్రామ శాఖ అధ్యక్షుడు దోటి శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ మెండు వెంకటరెడ్డి, మాజీ ఉప సర్పంచ్ ఊరుగుండ్ల వెంకటేశ్వర్లు, జాల వెంకన్న, కట్ట సైదులు, గాలెంక రాంబాబు, జోగు వెంకన్న, గంటెకంపు విజయ్, ఆకారపు శ్రీకాంత్, ఆమలూరి మనయ్య, ఎస్కే జాహంగీర్, ఆమలూరు బాలకృష్ణ, కట్ట శివరాం, కుక్కల స్వామి, బొమ్మరబోయిన కార్తీక్, ఆకారపు కాశయ్య పాల్గొన్నారు.