తుంగతుర్తి, అక్టోబర్ 11 : కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీఆర్ఎస్ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయాలన్నారు. శనివారం తుంగతుర్తి మండలం బండరామారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు, వికలాంగులకు రూ.6 వేల పెన్షన్, వృద్ధులు, వితంతువులకు రూ.4 వేల పెన్షన్, మహిళలకు ప్రతినెల రూ.2,500, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం, రైతు భరోసా పథకం ద్వారా రూ.15, కౌలు రైతులకు రూ.12 వేలు, విద్యార్థినులకు స్కూటీలతో పాటు 420 హామీలను ఇచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అకారపు భాస్కర్, కొల్లూరి మహేందర్, అకారపు రమేశ్, పులుసు బక్కయ్య, ఉప్పుల వెంకన్న, చల్ల కృష్ణమూర్తి, మంజుల పాల్గొన్నారు.