Kantareddy Tirupathireddy | నిజాంపేట, నవంబర్ 16 : నిజాంపేట మండలంలోని బచ్చురాజు పల్లి గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ మల్లేశం తండ్రి ఎర్ర మల్లయ్య(80) అనారోగ్యంతో, నస్కల్‌కు చెందిన లాలాగౌడ్ విద్యుత్ షాక్‌తో ఇటీవల చెందారు.
స్థానిక బీఆర్ఎస్ నేతల ద్వారా ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం ఇంచార్జ్ కంఠారెడ్డి తిరుపతిరెడ్డి బచ్చురాజ్ పల్లి, నస్కల్ గ్రామాలకు విచ్చేసి బాధిత కుటుంబాలను పరామర్శించారు.
అనంతరం నగరంలో విద్యుత్ షాక్ గురై చికిత్స పొందుతున్న సురేష్ నాయక్‌ను పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ సమయంలో కంఠారెడ్డి తిరుపతిరెడ్డి వెంట పీఏసీఎస్ చైర్మన్ అందె కొండల్ రెడ్డి మాజీ ఎంపీటీసీ చింతల స్వామి, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మావురం రాజు , బీఆర్ఎస్ నాయకులు ఎల్లమ్ యాదవ్, దుర్గయ్య, లచ్చపేట రాములు నాగేష్ నరేందర్ నాయక్ సుభాష్, నాయక్ రాజు ఆంజనేయులు తదితరులు ఉన్నారు.
Akhanda 2 | నందమూరి అభిమానులకు అదిరిపోయే అప్డేట్.. 3డీ ఫార్మాట్లో ‘అఖండ 2’
Rajkummar Rao | తల్లిదండ్రులైన బాలీవుడ్ స్టార్ దంపతులు
NBK 111 | బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబో రిపీట్.. ఈ నెలాఖరున కొత్త సినిమా ప్రారంభం!