Kalabhairava Swamy | మెదక్ రూరల్, నవంబర్ 26 : మెదక్ మండల పరిధిలోని ఖాజీపల్లి గ్రామంలో శ్రీ కాలభైరవ స్వామి ఆలయ 15వ వార్షికోత్సవాలు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు తాళ్లపల్లి రాజశేఖర్, తాళ్లపల్లి రవిశేఖర్ ఆధ్వర్యంలో మొదటి రోజు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాలభైరవ స్వామి వారిని ప్రత్యేక అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహించారు.
గణపతి పూజా యాగశాలకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అయ్యప్ప స్వాములు ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదాన వితరణ చేశారు. నేడు స్వామి సన్నిథిలో రెండో రోజు స్వామి వారికి బోనాలు, ప్రత్యేక పూజలు ఉంటాయని ఈ ఉత్సవాలకు మెదక్ జిల్లా భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించాలని కోరారు.
Nalgonda City : ‘అందరి హక్కులకు రక్షణ భారత రాజ్యాంగం’
Nalgonda City : ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి
Donations | టీటీడీకి రూ.9 కోట్లు విరాళం ..దాతను అభినందించిన చైర్మన్