తిరుమల : అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడు (NRI ) మంతెన రామలింగరాజు (Mantena Ramalinga Raju) , కుమార్తె మంతెన నేత్ర, అల్లుడు వంశీ గాదిరాజుల పేరు మీదుగా రూ.9 కోట్లు విరాళంగా (Donations ) అందించారు. తిరుమల ( Tirumala ) లోని యాత్రికుల వసతి సముదాయాల ఆధునీకరణకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు బుధవారం అందజేశారు.
ఈ సందర్భంగా తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో మీడియా సమావేశం నిర్వహించి దాతను అభినందించారు. మంతెన రామలింగరాజు 2012 లో కూడా టీటీడీకి రూ.16.06 కోట్లు విరాళంగా ఇచ్చారని చెప్పారు. తిరుమలలో భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనలో తన వంతు సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన రామలింగరాజుకు అభినందనలు తెలిపారు.
భవిష్యత్తులో టీటీడీకి మరిన్ని విరాళాలు అందిస్తారని అశిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విజయ నగరం ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు, టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, తదితరులు పాల్గొన్నారు.