Indiramma Houses | రామాయంపేట, మార్చి 27 : అర్హులైన వారికే ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని.. ఇండ్లు మంజూరైన ప్రతీ ఒక్క లబ్దిదారు ఇండ్లను త్వరితగతిన నిర్మించుకోవాలని జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాణిక్యం పేర్కొన్నారు.
ఇవాళ రామాయంపేట మండలం దామరచెర్వుకు విచ్చేసిన పీడీ మాణిక్యం గ్రామంలో నిర్మాణం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించి లబ్దిదారులను, రామాయంపేట ఎంపీడీవో, కార్యదర్శిని వివరాలడిగి తెలుసుకున్నారు.
అనంతరం పీడీ మాణిక్యం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అర్హులైన వారికే మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వం నుండి మంజూరైన ప్రతీ ఒక్కరూ తమ ఇండ్లను నిర్మించుకోవాలన్నారు. ఇండ్ల బిల్లులు విడతల వారీగా వస్తాయని.. లబ్దిదారులు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దన్నారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట ఎంపీడీవో షాజులుద్దీన్, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
TG Weather | తెలంగాణలో దంచికొడుతున్న ఎండలు.. మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్..
KTR | అవయవ దానానికి సిద్ధం.. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన కేటీఆర్
మళ్లీ రోడ్లపైకి నీటి ట్యాంకర్లు.. జోరుగా నీటి దందా..!