MLA Sunitha Lakshma Reddy | నర్సాపూర్, మార్చి 29 : ఇఫ్తార్ విందులో ముస్లిం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించి మాటను నిలబెట్టుకున్నారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి గత కొన్ని రోజుల క్రితం ముస్లిం సోదరులకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో పట్టణ సమీపంలోని ఈద్గా ప్రాంగణంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేలా ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించాలని ముస్లిం మత పెద్దలు, ముస్లిం ప్రజలు కోరడం జరిగింది.
వారి కోరిక మేరకు ఎమ్మెల్యే 25 కేవీ ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేయించడం జరిగింది. ఈ మేరకు ఇవాళ నూతన ట్రాన్స్ఫార్మర్ను బిగించగా.. ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం ప్రజలకు ఈద్గా వద్ద విద్యుత్ సమస్య తలెత్తకుండా ఉండడానికి వారి కోరిక మేరకు నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంతో చాలా సంతోషంగా ఉందని వెల్లడించారు.
నూతన ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేయించినందుకు ముస్లిం ప్రజలు, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సత్యంగౌడ్, ముస్లిం ప్రజలు మౌలానా మసియోద్దీన్, లాయక్ ఆలీ ఖాన్, షేక్ హుస్సేన్, ముజాహెద్ఖాన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేఖర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Kathmandu | నేపాల్లో హింస.. 100 మంది అరెస్ట్
Chilli Farming | సస్యరక్షణ చర్యలతోనే మిర్చి అధిక దిగుబడులు: డాక్టర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డి
Heart Health | ఈ ఆహారాలను తింటే మీకు గుండె పోటు అసలు రాదు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.