Hotels owners | తూప్రాన్, జూలై 03 : హోటళ్ళు, దాబాలు, రెస్టారెంట్ల యజమానులు నిబంధనలు పాటించాలని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ అన్నారు. గురువారం తూప్రాన్ డివిజన్ పరిధిలోని హోటళ్లు, దాబాలు, రెస్టారెంట్ల యజమానులతో లింగారెడ్డి గార్డెన్స్‌లో సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడే దుండగులు దాబా హోటళ్లు, రెస్టారెంట్లను ఆసరాగా చేసుకుని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉందని, రాత్రి వేళల్లో 11 గంటల వరకు హోటళ్లను మూసివేయాలన్నారు.
ప్రతీ ఒక్కరు విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, గంజాయి లాంటి నిషేధిత మత్తు పదార్థాలు, మద్యం విక్రయాలు, సిట్టింగ్ ఏర్పాటు చేయకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐ రంగకృష్ణ, ఎస్ఐ శివానందం, డివిజన్ పరిధిలోని పోలీసులు పాల్గొన్నారు.
SI Rajeshwar | బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు.. రోడ్డు ప్రమాదంలో ఫిల్మ్ నగర్ ఎస్ఐ మృతి
Fake medicines | ఉమ్మడి మెదక్ జిల్లాలో నకిలీ మందుల దందా.. పట్టించుకోని అధికారులు
DEO Radha Kishan | కేజీబీవీ పాఠశాలను తనిఖీ చేసిన డీఈవో రాధా కిషన్