Oil Palm | వెల్దుర్తి, జూన్ 15 : ఆయిల్ ఫాం సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని ఆయిల్‌ఫాం రాష్ట్ర టెక్నికల్ అడ్వైజరీ రంగనాయకులు అన్నారు. ఆదివారం వెల్దుర్తి మండల పరిధిలోని ఎల్కపల్లి గ్రామశివారులో రైతు సత్యనారాయణ సాగు చేస్తున్న ఆయిల్‌ఫాం మొక్కలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆర్థికాభివృద్ధికి ఆయిల్‌ఫాం సాగు ఎంతగానో దోహదపడుతుందని, ఆయిల్‌ఫాం సాగుతో నీటిని ఆదా చేయడంతోపాటు అంతర పంటల సాగు ద్వారా మరింత ఆదాయం వస్తుందన్నారు. ఈ ఆయిల్‌ఫాం సాగు 40 ఏండ్ల పాటు సాగు అవుతుందని, ఏడాదికి రూ. 1.50 లక్షల లాభం వస్తుందన్నారు.
ఈ పంటను పశువులు, అడవి జంతువులు నాశనం చేయవని, దళారీల మోసం, తాలు సమస్య ఈ పంటలో ఉండదని, పరిశ్రమలు నేరుగా రైతుల నుండి పంటను కొనుగోలు చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా 259 లక్షల టన్నుల ఆయిల్ ఫాం వాడకం జరుగుతుండగా, కేవలం 97 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఆయిల్ ఫాం సాగును పెంచేందుకు రాయితీ ఇస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వీరి వెంట జిల్లా మేనేజర్ కృష్ణారావు, డిప్యూటీ మేనేజర్ అశోక్‌లతో పాటు పలువురు ఉన్నారు.
Sim Card | మీ పేరుతో ఎవరైనా సిమ్‌కార్డు తీసుకున్నారా..? ఎలా తెలుసుకోవాలంటే..?
RFCL | కోలుకుంటున్న ఆర్ఎఫ్సీఎల్ బాధితుడు.. అప్రమత్తతతోనే తప్పిన అగ్ని ప్రమాదం
Free medical camp | దయానంద విద్యా సమితి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం