Corporation loans | నర్సాపూర్, నవంబర్ 17 : రాష్ట్రంలో ఎస్సీ ఉపకులాలకు కార్పోరేషన్ల ద్వారా ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి వారికి ఉపాధి చూపించి అదుకోవాలని హోలియదాసరి హక్కుల పోరాట సమితి రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి శాఖమూరి యాదగిరి హోలియదాసరి డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత అటు ఉద్యోగాలు లేక ప్రభుత్వం కార్పోరేషన్ల ద్వారా రుణాలు అందించక.. చదువుకున్న యువత కూడా దినసరి కూలీలుగా మారాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక ప్రైవేట్ రంగాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఎస్సీలకు ఉన్న 15 శాతం రిజర్వేషన్లను 22 శాతం వరకు పెంచి అమలు చేయాలని కోరారు.
చేవెళ్ల డిక్లరేషన్ను, ఎస్సీ ఉపకులాల కార్పొరేషన్ హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. అలాగే హోలియదాసరి కులస్తులకు, ఎస్సీ ఉపకులాలకు ఆర్డీవోల ద్వారా ఇస్తున్న కులధృవ పత్రాలను తహసీల్దార్ల ద్వారానే ఇవ్వాలని కోరారు. ఈ విషయమై ఉన్నతాధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఇంత వరకు ఎలాంటి మార్పు లేదని దీనివల్ల ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేధన వ్యక్తం చేశారు.
Sarangapur | పంటల అవశేషాలను కాల్చడంతో సేంద్రీయ పోషకాలు నశిస్తాయి.. సారంగాపూర్ ఏవో ప్రదీప్ రెడ్డి
Farmers Protest | పత్తిని కొనుగోలు చేయాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన
NBK 111 | బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబో రిపీట్.. ఈ నెలాఖరున కొత్త సినిమా ప్రారంభం!