జోగులాంబ గద్వాల : సీసీఐ(CCI) కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పత్తి వాహనంతో కలెక్టరేట్(Collectarate) వద్ద ఆందోళన నిర్వహించారు. పత్తి అమ్మకానికి స్లాట్ బుక్ ( Slot Booking) చేసుకొని వారం రోజులు అయిందని, సోమవారం అమ్మకానికి సీసీఐ కేంద్రానికి తీసుకొస్తే కొనుగోలు చేయడం లేదని చేయడం రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పత్తి రైతులు కలెక్టరేట్‌కు చేరుకుని ఆందోళన నిర్వహించారు.
అన్నదాతకు అడుగడుగునా అవస్థలే ఎదురవుతున్నాయని ఆరోపించారు. ఈ సంవత్సరం భారీ వర్షాలతో పత్తి పంట నష్టపోగా ఉన్న పత్తి పంటను కొనుగోలుకు అధికారులు, ప్రభుత్వం జాప్యం చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి రైతులు తెచ్చిన పత్తిని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.