Govt School | వెల్దుర్తి, జూన్ 07 : ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత చదువులు చదివిన అర్హత కలిగిన ఉపాధ్యాయులు ఉంటారని, దీంతో నిరుపేద పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని వెల్దుర్తి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం సాంబయ్య అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా రెండవ రోజైన శనివారం వెల్దుర్తి పట్టణంలోని బోదులగూడెం గ్రామంలో ఉపాధ్యాయులతో కలిసి ఇంటింటికి వెళ్లారు. ప్రైవేట్ పాఠశాలలకు వెళుతున్న విద్యార్థులు, బడీడు పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు.
అలాగే బడీడు పిల్లలను పాఠశాలలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా హెచ్ఎం సాంబయ్య తల్లిదండ్రులతో మాట్లాడుతూ.. పాఠశాలల్లో అన్ని అర్హత కలిగిన పోటీ పరీక్షలలో ఎంపికైన ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తారని.. తద్వారా పిల్లలకు మంచి బోధన అందుతుందన్నారు. అలాగే పాఠశాలలో క్రీడలతోపాటు మధ్యాహ్నం మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం జరుగుతుందన్నారు.
ప్రైవేట్‌కు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు రూపుదిద్దుకున్నాయన్నారు. కావున విద్యార్థుల తల్లిదండ్రులు లక్షలు వెచ్చించి ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించి ఆర్థిక ఇబ్బందులకు గురికావొద్దని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి మంచి విద్యాబోధనను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
Read Also :
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Bakrid Celebrations | ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లిములు