Dragon Fruit | మెదక్ రూరల్, సెప్టెంబర్ 23 : మెదక్ మండల పరిధిలోని ర్యాల మడుగు గ్రామంలోని రైతు వేదికలలో ఉద్యాన పంటల సాగు, డ్రాగన్ ఫ్రూట్స్ పంటపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో మెదక్ ఏడీఏ విజయనిర్మల, మెదక్ సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ సంప్రదాయ పంటలతో విసిగిపోయిన రైతులు దీర్ఘకాలికంగా లాభాలు తెచ్చి పెట్టే డ్రాగన్ ఫ్రూట్ వైపు మొగ్గు చూపాలన్నారు. ఒక్కసారి సాగు చేస్తే సుమారు 25 ఏండ్లపాటు మంచి దిగుబడి రావడం, మార్కెట్లోనూ ఈ పండ్లకు డిమాండ్ ఉండడంతోపాటు ప్రభుత్వం సబ్సిడీపై పరికరాలు ఇస్తున్నందున చాలామంది ఈ పంట వేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.
ఒక ఎకరానికి ఏటా రూ.3 లక్షల వరకు ఆదాయం రావడమే కాకుండా ఔషధ గుణాలున్న ఈ ఫ్రూట్ ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందన్నారు. ఉద్యాన పంటల సాగు చేసి అధిక లాభాలు పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో తేజస్విని, రైతులు పాల్గొన్నారు.
Hyderabad Metro | మరోసారి ఆగిపోయిన మెట్రో రైలు.. ఆందోళనకు గురైన ప్రయాణికులు
Fire Accident | మైలార్దేవ్పల్లి పీఎస్ పరిధిలో తప్పిన పెను ప్రమాదం
Harish Reddy | నెలరోజులైనా తెరచుకోని రామగుండం ఎరువుల కర్మాగారం: బీఆర్ఎస్ నేత హరీశ్ రెడ్డి