MLC Kalvakuntla Kavitha |మనోహరాబాద్, ఏప్రిల్ 12 : బీఆర్ఎస్ హయాంలో ఆలయాల అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం కూచారం గ్రామంలో జరిగిన హనుమాన్ జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూచారం హనుమాన్ దేవాలయానికి రూ. 22 లక్షల రూపాయలు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
అంతకు ముందు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, గజ్వేల్ నియోజక వర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్‌రెడ్డి, మాజీ జెడ్పీ ఛైర్ పర్సన్ హేమలతా శేఖర్ గౌడ్లతో, నాచారం గుట్ట దేవస్థానం మాజీ ఛైర్మెన్ కొట్టాల యాదగిరితోపాటు ఉద్యమ నాయకులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా కూచారం గ్రామ చౌరస్తాలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకుని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి మాదిరా.. సవతి తల్లి మీదిరా అంటూ కాంగ్రెస్ పార్టీనుద్దేశించి అన్నారు. అనంతరం నిర్వహించిన శోభాయాత్రలో ఆమె పాల్గొన్నారు.
అనంతరం గ్రామంలోని కోదండ రామాలయాన్ని, హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మనోహరాబాద్ మాజీ ఎంపీపీ పురం రవి నవనీత ముదిరాజ్, పార్టీ గ్రామాధ్యక్షుడు దాసరి నరేష్ ముదిరాజ్, సీనియర్ నాయకులు నాయిని ఉదయ్ రంజన్ గౌడ్, అనంతారం వీరేష్ గౌడ్, మంగ్యా నాయక్, నాయిని నందు గౌడ్, మొద్దు ప్రేమ్ కుమార్, అర్కల రమేష్ ముదిరాజ్, యావపురం కృష్ణ, రాజు నాయక్, తొంట శంకర్, చింపుల మురళి, వడ్డె యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
Ramakrishna Math | రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణా శిబిరాలు
padi koushik reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
Mutton | మటన్‌ను ఎంత మోతాదులో తింటే మంచిది..? ఈ లిమిట్ దాటితే కష్టమే..!