నిజాంపేట,జనవరి31 : పేద ప్రజల అభ్యున్నతి కోసం ప్రజా యుద్ధనౌక గద్దర్(Gaddar Jayanthi )నిరంతరం పోరాడారని పలువురు వక్తలు పేర్కొన్నారు. మెదక్ జిల్లా నిజాంపేటలోని(Nizampet) నూతన బస్టాప్ వద్ద గద్దర్ జయంతి వేడుకలను ప్రజాసంఘాలు, దళిత బహుజన ఫ్రంట్ అధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తన ఆట,పాటతో లక్షాది మందిని మేల్కొల్పిన గొప్ప గాయకుడు గద్దర్ అని ప్రశంసించారు.
సామాన్యులకు అర్థమయ్యే విధంగా పాటలు అల్లి ఉత్తేజపరిచేవాడన్నారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాత్ర మరువలేనిదని తెలిపారు. గద్దర్ మృతి ప్రజా సంఘాలకు తీరని లోటన్నారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ బాబు,దళిత బహుజన ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు సంజీవ్, నాయకులు మారుతి, వెంకటేశ్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్, మోహన్‌రెడ్డి, అమర్, రాజు, సురేశ్, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..