లక్నో: డివైడర్ వద్ద ఉన్న రాయిని ఢీకొట్టడంతో ట్రాక్టర్ టైరు పేలింది. దీంతో అదుపుతప్పిన ఆ ట్రాక్టర్ పల్టీలు కొట్టింది. (Tractor Flips) దానిని నడిపిన వ్యక్తి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో ఈ సంఘటన జరిగింది. గురువారం మధ్యాహ్నం ఒక వ్యక్తి ట్రాక్టర్ను రోడ్డుపై వేగంగా డ్రైవ్ చేశాడు. అయితే డివైడర్ పక్కగా వెళ్తుండగా ట్రాక్టర్ ముందు టైరు డివైడర్ రాయిని ఢీకొట్టడంతో అది పేలింది. దీంతో ఆ ట్రాక్టర్ అదుపుతప్పింది. రెండుసార్లు పల్టీలుకొట్టి తిరిగి యధాస్థితికి వచ్చి ఆగింది. ఇది చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు.
కాగా, ట్రాక్టర్ డ్రైవర్ రోడ్డుపై పడ్డాడు. అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. గాయపడిన ట్రాక్టర్ డ్రైవర్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
UP: A tractor flips in Muzaffarnagar reportedly after a tire bursts.#ViralVideo #Viral pic.twitter.com/x4LJ2d7MCi
— TIMES NOW (@TimesNow) January 31, 2025