పెద్దపల్లి : పెద్దపల్లి(Peddapalli) జిల్లాలో భారీ చోరీ(Grand theft) జరిగింది. తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా దుండగులు దొంగతనాలకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. గోదావరిఖని పట్టణం గౌతమినగర్లో తాళం వేసి ఉన్న ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగలుగొట్టి 16 లక్షల రూపాయల నగదును దోచుకెళ్లారు. గౌతమినగర్లో నివాసముండే సింగరేణి రిటైర్డ్ కార్మికుడు రామ్మోహన్ రావు భార్యకు క్యాన్సర్ వ్యాధి రావడంతో హైదరాబాద్ లో ఓ హాస్పిటల్లో చికిత్సా చేయిస్తున్నాడు.
కాగా, హాస్పిటల్ నుంచి తెల్లవారుజామున ఇంటికి రాగా తలుపులు పగలగొట్టి ఉన్నాయి. ఇంట్లో బీరవాలో ఉన్న నగదు 16 లక్షల రూపాయలు కనిపించకుంఆ పోయాయి. రామ్మోహన్ రావు వెంటనే ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫింగర్ ప్రింట్ బృందాన్ని రంగంలోకి దింపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..