Priyanka Chopra | బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా (Priyanka Chopra) పాపులర్ అమెరికన్ సింగర్ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత హాలీవుడ్‌కు పరిమితమైపోయిందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ భామ ఆర్ఆర్ఆర్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో వస్తోన్న గ్లోబల్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబీ 29 (SSMB29)తో ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పైకి గ్రాండ్ రీఎంట్రీకి రెడీ అయిందని తెలిసిందే.
ఆఫ్రికన్ అడ్వెంచరస్ ప్రాజెక్ట్‌గా రానున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ కొనసాగుతున్నట్టు ఫిలింనగర్ సర్కిల్లో ఇప్పటికే వార్తలు రౌండప్ చేస్తున్నాయి. ఇదిప్రియాంకా చోప్రా తెలుగులో ఫుల్ లెంగ్త్ రోల్లో నటిస్తోన్న తొలి సినిమా అని తెలిసిందే. ఈ సినిమాకు తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తాజా కథనాల ప్రకారం జక్కన్న ప్రాజెక్ట్ కోసం ప్రియాంకా చోప్రా ఏకంగా రూ.30 కోట్లు తీసుకుంటుందట. ఇదే నిజమైతే రీఎంట్రీ తర్వాత ప్రియాంకా చోప్రా తీసుకుంటున్న భారీ మొత్తం అవుతుందంటున్నారు సినీ జనాలు. మరి దీనిపై ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. 2002లో తొలిసారి తమిళ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంకా చోప్రా ఆ తర్వాత తన ఫోకస్ అంతా బాలీవుడ్‌పైనే పెట్టింది. రాంచరణ్ నటించిన తుఫాన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా హాయ్ చెప్పింది.
SSMB2⃣9⃣
Priyanka Chopra remuneration – ₹3⃣0⃣ cr
— Manobala Vijayabalan (@ManobalaV) January 30, 2025
Ram Gopal Varma | సిండికేట్‌పై వర్క్ చేస్తున్నా.. కానీ ఆ వార్తలు అబద్ధం.. పుకార్లపై రాంగోపాల్ వర్మ