గోల్నాక, జనవరి 30 : కానిస్టేబుల్ ఆత్మహత్యకు(Constable Commits suicide) పాల్పడిన ఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అంబర్‌పేట దుర్గానగర్‌లో నివాసముంటూ మాదన్న పేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు (42) ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. 2007 బ్యాచ్‌కు చెందిన వెంకటేశ్వర్లు గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చున్నీతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు .కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, వెంకటేశ్వర్లు ఆర్థిక ఇబ్బందులు కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డాడరని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..