Fire Accident | తూప్రాన్, మే 21: 44వ జాతీయ రహదారిపై నాగులపల్లి బ్రిడ్జి వద్ద ఓ కంటైనర్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించడంతో కార్లు దగ్ధమైనట్టు అధికారులు గుర్తించారు. గురువారం మధ్యాహ్నం నాగులపల్లి బ్రిడ్జి వద్ద కార్ల లోడుతో వెళుతున్న కంటైనర్లో ఆకస్మికంగా మంటలు వ్యాపించి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కంటైనర్లో ఉన్న 8 కార్లు దగ్ధమైనట్టు అధికారులు గుర్తించారు.
సమాచార మందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్నిప్రమాదంతో జాతీయ రహదారిపై ఎక్కడికక్కడ భారీగా వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు.