Bandla Ganesh | మళ్లీ పవన్ కళ్యాణ్‌కి దగ్గరైన బండ్ల గణేష్ .. ‘మెగా 158’ వేదికపై వైరల్ అయిన సన్నివేశాలు
Bandla Ganesh | టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఆయనకు పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానమే. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్‌పై తన ప్రేమని బహిరంగంగానే వ్యక్తం చేసిన బండ్ల గణేష్, “మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్” అంటూ ఇచ్చిన స్పీచ్‌లు సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాయి.
Bandla Ganesh | టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పేరు వినగానే చాలా మందికి ముందుగా గుర్తొచ్చేది ఆయనకు పవన్ కళ్యాణ్‌పై ఉన్న అభిమానమే. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్‌పై తన ప్రేమని బహిరంగంగానే వ్యక్తం చేసిన బండ్ల గణేష్, “మై గాడ్ ఈజ్ పవన్ కళ్యాణ్” అంటూ ఇచ్చిన స్పీచ్‌లు సోషల్ మీడియాలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాయి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్-బండ్ల గణేష్ మధ్య మంచి అనుబంధం ఉండేది. పవన్ హీరోగా బండ్ల నిర్మాణంలో తీన్మార్, గబ్బర్ సింగ్ వంటి చిత్రాలు రూపొందాయి. ముఖ్యంగా గబ్బర్ సింగ్ విజయం తర్వాత వీరిద్దరి స్నేహం మరింత బలపడిందనే అభిప్రాయం ఉండేది.
అయితే గత కొంతకాలంగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే చర్చ సినీ వర్గాల్లో వినిపించింది. పవన్ సినిమా ఈవెంట్లలో బండ్ల గణేష్ కనిపించకపోవడం, ఇద్దరూ కలిసి బహిరంగంగా కనిపించకపోవడం వంటి కారణాలతో ఈ ప్రచారం మరింత బలపడింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడం ఆసక్తికరంగా మారింది. చిరంజీవి హీరోగా దర్శకుడు కేఎస్ రవీంద్ర తెరకెక్కిస్తున్న మెగా 158 చిత్రం పూజా కార్యక్రమాలు తాజాగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే కార్యక్రమానికి బండ్ల గణేష్ కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ మధ్యలో నిలబడి బండ్ల గణేష్ ఫోటోలు దిగారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ బండ్ల గణేష్ భుజంపై చేయి వేసి ఆప్యాయంగా మాట్లాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చిరంజీవి కూడా అతనితో సరదాగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో “పవన్ – బండ్ల బాండింగ్ మళ్లీ ట్రాక్‌లోకి వస్తోందా?” అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు.
#Pawankalyan & #Bandlaganesh Together at #chiru158 Launch pic.twitter.com/XT0xlmR7Ff
— Roll Media (@Rollmedia9) May 21, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress rule | కాంగ్రెస్ పాలనలో మళ్లీ అయిల్ ఇంజన్లు..! కన్నీళ్లతో సాగు చేస్తున్న రైతన్నలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
Thailand Queen: గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన థాయ్‌ల్యాండ్ క్వీన్… వీడియో
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

