Dumping Yard | డంపింగ్ యార్డులో చెలరేగిన మంటలు.. ఇంతకీ కారణమేంటో..?
Dumping yard నర్సాపూర్ పట్టణ శివారులోని ఓ డంపింగ్ యార్డులో బుధవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ తగలబడడంతో వాతావరణం కాలుష్యానికి గురవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
Dumping Yard | నర్సాపూర్, ఫిబ్రవరి 18 : నర్సాపూర్ పట్టణ శివారులోని మెదక్ మార్గంలో ఉన్న డంపింగ్ యార్డులో బుధవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకున్నది. ఈ విషయాన్ని గమనించిన పట్టణవాసులు ఏం జరుగుతుందోనని ఆందోళనకు గురయ్యారు. డంపింగ్ యార్డులో వేసిన ప్లాస్టిక్ వ్యర్థాలతోపాటు ఇతర చెత్తాచెదారం అగ్నికి ఆహుతయ్యాయి.
కాగా పారిశ్రామిక వ్యర్ధాలను తీసుకువచ్చి డంపింగ్ యార్డులో పడేసి గుట్టుచప్పుడు కాకుండా తగలబెడుతున్నారనే ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ తగలబడడంతో వాతావరణం కాలుష్యానికి గురవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మంటలు ప్రమాదవశాత్తు అంటుకున్నాయా..? లేక చెత్త పెద్ద మొత్తంలో పేరుకుపోవడంతో కావాలనే ఎవరైనా తగలబెట్టారా..? అని అనుమానం వ్యక్తం అవుతుంది.
డంపింగ్ యార్డులోని చెత్తను విచ్చలవిడిగా పారవేయకుండా రీ-సైక్లింగ్ చేయాలని పలువురు బావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంతో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరుగకున్నా, మున్ముందు ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగితే వాతావరణానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంటుందని పట్టణవాసులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ఇలాంటి అగ్ని ప్రమాదాలు పునఃరావృతం కాకుండా చూడాలని పట్టణ వాసులు కోరారు.
డంపింగ్ యార్డులో మంటలు..
Read Also :
Mammootty | రుచి, వాసన తెలియలేదు.. తొలిసారి ఆరోగ్య సమస్యపై నోరు విప్పిన మమ్ముట్టి
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

