నిజాంపేట,మే4 : నిజాంపేటకు చెందిన దొమ్మాట జయమ్మ(63) కాన్సర్ వ్యాధితో వారం రోజుల క్రితం మృతి చెందింది. విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకుడు చల్మేటి నరేందర్ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించి రూ.5 వేలు ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం ఆయన స్థానికంగా ఉన్న బాలవికాస వాటర్ ప్లాంట్లో కూల్ వాటర్ ఏర్పాటు కోసం తన వంతుగా 21,111 రూపాయలను కమిటీ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు సిద్ధిరాంరెడ్డి, గెరుగంటి బాబు, కొమ్మాట అమర్, స్వామి, తిరుపతి, శివ, మహేశ్, నర్సింహారెడ్డి ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
EAPCET | మౌస్ పనిచేస్తలేదని చెబితే.. నా బదులు వాళ్లే పరీక్ష రాశారు