Janu Lyri | తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటికే అనేక సమస్యలు పుట్టుకొస్తున్నాయి. అవి సరిపోలేదన్నట్టు డ్యాన్సర్ జాను లిరి చేసిన హడావుడి ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. తనను మానసికంగా వేధిస్తున్నారని, రెండో పెళ్లి చేసుకున్నానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఇక తనకు ఆత్మహత్యే శరణ్యమంటూ బోరుమన్న ఈ అమ్మడు పెద్ద షాక్ ఇచ్చింది.అయితే పాపం జాను పరిస్థితిని అర్ధం చేసుకొని కొందరు ఆమెకి సపోర్ట్ చేశారు. కాని ఇప్పుడు వారికే కోపం తెప్పించింది జాను. అంత డ్రామా ఆడింది రెండో పెళ్లి కోసమా అంటూ కొందరు కామెంట్ చేశారు. తొలి వీడియో తర్వాత జాను వీడియో వైరల్ కాగా, దానిపై కొందరు నెగెటివ్,పాజిటివ్‌గా కామెంట్ చేశారు.
అయితే శనివారం జాను మరో వీడియో విడుదల చేస్తూ.. అందులో ముందుగా అందరికి సారీ చెప్పింది. నేను ముందు విడుదల చేసిన వీడియో వలన చాలా మంది బాధపడ్డారు. ఎంతో మంది రియాక్ట్ అయ్యారు. చాలా మంది సపోర్టు చేశారు. సపోర్టు చేసిన వారికి థ్యాంక్యూ సోమచ్. నేను చాలా రోజుల నుంచి అన్నీ చూస్తూ ఉన్నా. అది భరించలేక బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. నేను ఎవరికీ భయపడేదాన్ని కాదు. భయపడితే.. ఈ స్టేజిలో ఉండేదాన్ని కాదు.. నేను చాలా స్ట్రాంగ్.. ఆ విషయం మీ అందరికి తెలుసు.
పెళ్లి గురించి ఓ విషయం చెప్పాలని అనుకుంటున్నా. నా పెళ్లి వలన మీకేమైన నష్టం ఉందా, లేదు కదా. కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను. నేను, నా కొడుకు సంతోషంగా ఉండి.. ఆ సంతోషంతో మీకు సమాధానం చెబుతాము. ఇంతకముందు చేసిన వీడియోను కొంతమంది మంచిగా తీసుకున్నారు. కొంత మంది చెడుగా తీసుకున్నారు. ట్రోలింగ్ ఆగదు. నాకు అర్థం అయింది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటూ జాను చెప్పుకొచ్చింది. ఇక తెలుగులోని ప్రముఖ ఛానెల్లో ప్రసారమయ్యే ఢీ అనే డ్యాన్సింగ్ షోలో ఎంతోమందిని వెనక్కినెట్టి విజేతగా నిలిచింది జాను లిరి. ఆ ఒక్క షోతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయిన ఈమె.. పాటలు, డ్యాన్సులతో సోషల్ మీడియాలోనూ హల్చల్ చేసి సెలబ్రెటీ స్టేటస్ దక్కింది.