Urea | శివ్వంపేట, ఆగస్టు 24 : కాంగ్రెస్ పాలనలో యారియా(Urea )కష్టాలు రైతన్నలను వెంటాడుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సరిపడా యూరియా లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఆగ్రోస్ కేంద్రాలు, రైతువేదికల వద్దకు పెద్ద సంఖ్యలో రైతులు యూరియా కోసం తరలివచ్చారు. యూరియా కోసం అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు.
రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. రైతులు ఆదివారం మండల కేంద్రమైన శివ్వంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వద్ద మబ్బుల (వేకువజాము నుంచే) నుంచి చెప్పులు, ఇటుకలు క్యూలైన్లో పెట్టి పడిగాపులు కాశారు.
అనంతరం అదే లైన్లో యూరియా బస్తాల కోసం భారీ క్యూ కట్టారు. రైతుల క్యూ ఎక్కువ కావడంతో ఒకరినొకరు తోసుకుంటూ ఇబ్బంది పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు పీఏసీఎస్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇస్తున్న చాలీచాలని యూరియా కూడా సరైన సమయానికి చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Daisy Shah | వాళ్లకి నడుము, బొడ్డు పిచ్చి ఉంది.. సౌత్ ఇండస్ట్రీపై నటి సంచలన వ్యాఖ్యలు
IADWS | ఆధునిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన డీఆర్డీఓ
Finger Millet | రాగులను అసలు రోజుకు ఎంత మోతాదులో తినాలి..? వీటితో కలిగే లాభాలు ఏమిటి..?